Dec 23, 2007

తరలి రాద తనే వసంతం (RudraVeena)

TiTlE: tarali raada tane vasantam
MuSiC: Illayaraja
MoViE: RudraVeena
ArTiSt: S P Balasubramanyam
Lyrics:






తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం కొందరిదా...
అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా...
అడవిని సైతం వెలుగు కదా

ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేని శృతి కలదా
యదసడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా
యదసడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...

ప్రజాధనం కానీ కళావిలాసం
ఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పాడే ఏనే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలకదు కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం


(lyrics posted by kishore, tmw)

No comments: